- కోలుకున్న 20 మంది
- కుళ్లిన గుడ్లు, క్వాలిటీ లేని ఆహారమే కారణమన్న పేరెంట్స్
- సంగారెడ్డి జిల్లా బీబీపేట హైస్కూల్లో ఘటన
నారాయణ్ ఖేడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేరు మండలంలోని బీబీపేట హైస్కూల్లో మిడ్ డే మీల్స్‌తో ఫుడ్ పాయిజన్ అవ్వడంతో 24 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్న భోజనంలో స్టూడెంట్స్ కు బెండకాయ, చారు, గుడ్లు పెట్టినట్లు స్కూల్ సిబ్బంది తెలిపారు. మధ్యాహ్నం భోజనం తర్వాత కొంతమంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో బాధపడడంతో వారిని నారాయణఖేడ్ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. 24 మంది విద్యార్థుల్లో 20 మంది కోలుకోగా నలుగురు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. స్కూల్లో 115 మంది చదువుకుంటున్నారు. కుళ్లిన గుడ్లు, క్వాలిటీ లేని భోజనం పెట్టడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగిందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.