జూబ్లీహిల్స్​ రెస్టారెంట్లలో ఫుడ్​ సేఫ్టీ అధికారులు తనిఖీలు.. కిచెన్​ లో బొద్దింకలను గుర్తించిన ఆఫీసర్స్​

జూబ్లీహిల్స్​ రెస్టారెంట్లలో ఫుడ్​ సేఫ్టీ అధికారులు తనిఖీలు.. కిచెన్​ లో బొద్దింకలను గుర్తించిన ఆఫీసర్స్​

హైదారాబాద్ జూబీహిల్స్ లోని పలు రెసారెంటపై ఫుడ్ సేఫ్టీ అధికారులు  దాడులు నిర్వహించారు. పోష్ నాష్ లాంజ్ అండ్ బార్..  కేక్ ది హట్టి రెస్టారెంట్ లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని గుర్తించారు. కుళ్లిపోయిన కూరగాయలు వినియోగిస్తున్నటు అధికారులు గుర్తించారు.  కిచెన్​లో బొద్దింకలు.. పురుగులు తిరుగుతున్నా రెస్టారెంట్​ యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు .  కాలం చెల్లిన రా మెటీరియల్​ తో ఫుడ్​ ఐటమ్స్ తయారు చేస్తున్నారు.  హానికరమైన సిట్రిక్ యాసిడ్ ను ఫుడ్ లో వాడుతున్నట్లు అధికారులు తెలిపారు. పోష్ నాష్ లాంజ్ అండ్ బార్ లైసెన్స్ గడువు ముగిసిందని  తిరిగి రెన్యువల్​ చేసుకోలేదని  .. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఈ రెండు రెస్టారెంట్లపై కేసు నమోదు చేస్తామని ఫుడ్​ సేఫ్టీ అధికారులు తెలిపారు. 

ALSO READ | తెలంగాణలో బీసీల లెక్క తేలింది..ఇక ఎన్నికలే..