మాదాపూర్​లో శ్రీచైతన్య సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు

మాదాపూర్​లో శ్రీచైతన్య సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు

మాదాపూర్, వెలుగు: మాదాపూర్​లోని శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్ ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌‌మెంట్ రద్దు చేసింది. ఈ కిచెన్‌‌లో రాష్ట్ర ఫుడ్‌‌ సేఫ్టీ అధికారులు ఇటీవల తనిఖీలు చేశారు. ఇక్కడి నుంచే సిటీలోని శ్రీచైతన్య కాలేజీల హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నారు. 

కిచెన్​లో అపరిశుభ్రత, పాడైపోయిన పదార్థాలు, స్టోర్ రూమ్‌‌లో  బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్టు గుర్తించిన అధికారులు.. కిచెన్‌‌ను సీజ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీంతో కిచెన్‌‌లో ఫుడ్​తయారీని వెంటనే నిలిపివేయాలని ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.