హైదరాబాద్‎లో రత్నదీప్ సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేప్టీ తనిఖీలు

హైదరాబాద్ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు 2024, నవంబర్ 20 బుధవారం మెరుపు దాడులు చేశారు. రాష్ట్ర రాజధానిలో ఫుడ్ కల్తీ ఘటనలు రోజుకో చోట వెలుగు చూస్తుండటంతో బుధవారం నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు‎, సూపర్ మార్కెట్లలో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

 ఇందులో భాగంగా యూసఫ్ గూడా రత్నదీప్ సూపర్ మార్కెట్‎లో సోదాలు చేసిన అధికారులు..‎ FSSAI నిబంధనలకు విరుద్ధంగా పలు ఐటమ్స్ అమ్ముతున్నట్లు గుర్తించి ఈ మేరకు సూపర్ మార్కెట్ నిర్వహకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. 

Also Read :- అల్లం.. వెల్లుల్లి పేస్టులో సింథటిక్ రంగులు కలుపుతున్నారు

అమీర్ పేట్‎లోని ఉత్తరాస్ టిఫిన్స్, అయితే బిర్యానీ, టిబ్బ్స్ ప్రాక్టీస్, కింగ్స్ ఆఫ్ కబాబ్స్‎తో పాటు మెహదీపట్నంలోని అబ్దుల్ బాయ్స్ హాస్టల్, మధురానగర్‎లోని యూనివర్సల్ ఆల్ మాతం మండి కబాబ్స్ అండ్ బిర్యానీ సెంటర్లో కూడా అధికారులు తనిఖీలు చేశారు. పలు రెస్టారెంట్లు సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించి.. వాటిని సీజ్ చేసి టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించి ల్యాబ్‎కి పంపించారు.

 చాలా చోట్ల హాస్టల్స్, రెస్టారెంట్ల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వహకులను ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.