హైదరాబాద్లో 28 హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

హైదరాబాద్లో 28 హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

హైదరాబాద్, వెలుగు: సిటీలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్​రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కిచెన్, వంట సామగ్రి, స్టోరేజ్ ఏరియా, ఫుడ్ ఐటమ్స్ , రా మెటీరియల్ తో పాటు శానిటేషన్ నిర్వహణ తదితర ప్రాంతాలను పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు  సిటీలో మూడు రోజులుగా తనిఖీలు కొనసాగిస్తుండగా.. ఇప్పటివరకు మొత్తం 28  ప్రైవేటు, ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టళ్లల్లో తనిఖీ చేశారు. 

ఎల్ బీనగర్ జోన్ 4 , చార్మినార్ 6,  ఖైరతాబాద్ 5, శేరిలింగం పల్లి 5, కూకట్ పల్లి 4, సికింద్రాబాద్ 4 హాస్టళ్లను పరిశీలించారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించని హాస్టళ్లకు ముందుగా అవగాహన కల్పిస్తున్నారు.  మరోసారి  రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అప్పటికీ మారకపోతే నోటీసులు జారీ చేస్తున్నారు.