ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారిద్దాం : ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కిరణ్ కుమార్

ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారిద్దాం : ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కిరణ్ కుమార్
  • ఉమ్మడి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కిరణ్ కుమార్

ఖమ్మం టౌన్, వెలుగు :  ‘ప్రజా ఆరోగ్యం పై దృష్టి సారిద్దాం.. వాడిన వంట నూనెను బయో డీజిల్ గా రీసైక్లింగ్ చేసేందుకు ప్రోత్సహిద్దాం’ అని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాయపూడి కిరణ్ కుమార్ రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వ్యాపారులకు పిలుపునిచ్చారు. మంగళవారం రీ పర్పస్ యూజ్డ్ కూకింగ్ ఆయిల్ (రూకో) నిర్వహకుడు సాయినాథ్​ ఆధ్వర్యంలో నగరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో రెస్టారెంట్ల నిర్వహకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ వాడిన వంట నూనె ను తిరిగి వాడటం వల్ల ప్రజలు ఎలా అనారోగ్యం పాలవుతున్నారో వివరించారు. 

ఒకటి, రెండు సార్లు వాడిన నూనెను రూకో వారు కొనుగోలు చేసి,ఆ నూనెను వరంగల్ లోని బయో డీజిల్  తయారీ కేంద్రానికి పంపుతారని చెప్పారు. ఈ సదస్సులో  శిక్షణ సేఫ్టీ అధికారి శరత్ కుమార్, పోలాస్ యజమాని పోలా శ్రీనివాసరావు, రెవెన్యూ ఇన్​స్పెక్టర్ రామారావు, రెస్టారెంట్ యజమానులు నరసింహారావు, సిబ్బంది దీక్షిత్, రవితేజ,వర్మ, వివేక్, ప్రీతం, మధు తదితరులు పాల్గొన్నారు.