ఫుడ్ సేఫ్టీలో హైదరాబాద్ చివరన ఉందా.. అధికారులు ఏమంటున్నారంటే..

ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో స్ట్రీట్ ఫుడ్ లో కల్తీ అవుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాకుండా బడా రెస్టారెంట్లు, హోటళ్లలో కూడా కల్తీ బాగోతం బయటపడింది. ఆ మధ్య మోమోస్ తిని ఓ మహిళ మరణించటం, షవర్మా తిని పలువురు అస్వస్థతకు గురవ్వటం వంటి ఘటనలు హైదరాబాద్ లో బయట ఫుడ్ తినాలంటేనే భయపడేలా చూశాయి. ఇదిలా ఉండగా.. ఫుడ్ సేఫ్టీలో హైదరాబాద్ చివరి స్థానంలో ఉందంటూ అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో కధనాలు వైరల్ గా మారాయి. ఈ కథనాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించారు.

ఫుడ్ సేఫ్టీలో హైదరాబాద్ చివరన ఉందంటూ‌ మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారుఫుడ్ సేఫ్టీ అధికారులు.2022 సంవత్సరంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి నమోదైన కేసుల ఆధారంగా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 డిసెంబర్‌లో నివేదిక విడుదల చేసిందని స్పష్టం చేశారు అధికారులు.

2022లో హైదరాబాద్‌లో ఫుడ్ కల్తీపై 246 కేసులు నమోదయ్యాయని,ఇదే విషయాన్ని 2023 చివరలో విడుదలైన క్రైమ్ ఇన్ ఇండియా 2022 నివేదికలో పొందుపర్చారని క్లారిటీ ఇచ్చారు.అప్పటి సమాచారంతో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుడ్ సేఫ్టీలో హైదరాబాద్ చివరన ఉందంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నారు.ప్రజలకు నాణ్యమైన ఫుడ్ అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.