నిర్మల్​ డీమార్ట్ లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీలు

నిర్మల్​ డీమార్ట్ లో ఫుడ్  సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీలు

నిర్మల్, వెలుగు: నిర్మల్ లోని డీ మార్ట్  మాల్ లో ఫుడ్  సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టారు. స్థానిక వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆఫీసర్లు ఆకస్మికంగా తనిఖీ చేసి కాలం చెల్లిన నెయ్యి, ఇతర ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మాల్  నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్  ఇన్​స్పెక్టర్  ప్రత్యూష ఆధ్వర్యంలో రెండు గంటలకుపైగా తనిఖీలు జరిగాయి.

 సీజ్  చేసిన నెయ్యి, ఇతర ఆహార పదార్థాలను ఫోరెన్సిక్  ల్యాబ్ కు పంపుతున్నట్లు ఫుడ్  ఇన్స్​పెక్టర్  తెలిపారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను అమ్ముతున్న డీమార్ట్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వస్తువులపై ఎక్స్ పైరీ డేట్ పరిశీలించి కొనుగోలు చేయాలని సూచించారు. ఎక్స్ పైరీ అయిన వస్తువులను విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.