కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హోటల్స్, సూపర్ మార్కెట్లలోగురువారం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేశారు. ఫుడ్‌సేప్టీ ఆఫీసర్టి.సునీత, అసిస్టెంట్ఫుడ్కంట్రోలర్ ఎం.ఎ.ఖలీల్ తనిఖీలు చేశారు.
హోటల్స్‌లో కిచెన్లు, వంటల్లో వాడుతున్న పదార్థాలను పరిశీలించారు. నిషేధిత రసాయన పదార్థాలు, గడువు దాటిన ఉత్పత్తులను పారవేయించారు. శుభ్రత పాటించని హోటల్స్‌కు నోటీసులు ఇచ్చారు.