హైదరాబాద్ లో ఫుడ్సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. అమీర్పేట ప్రాంతంలోని తినుబండారాల దుకాణాల్లో ఆహార భద్రత సిబ్బంది తనిఖీ చేశారు.ఆహార భద్రత ఉల్లంఘనలను గుర్తించారు. వాసిరెడ్డి ఫుడ్స్, వినూత్న ఫుడ్స్, ఢిల్లీ మిఠాయి వాలా, ఆగ్రా స్వీట్ షాప్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడంలేదని అధికారులు తెలిపారు.
కిచెన్ లో ఉండే పని చేసే ఫుడ్ హ్యాండర్లు, ఇతర సిబ్బంది ఎలాంటి గ్లౌజులు లేదా ఆప్రాన్‌లు ధరించలేదని అధికారులు తెలిపారు. దుకాణంలో విక్రయించే కొన్ని వస్తువులకు FSSAI సర్టిఫికేట్ఎక్స్ పైర్ అయినా రెన్యువల్ చేయించుకోలేదు. కిచెన్ లు అపరిశుభ్రంగా ఉన్నాయని.. అక్కడ ఉండే డస్ట్ బిన్ లపై ఎలాంటి మూతలు లేకుండా తెరిచి ఉంచినట్లు గుర్తించారు,