జంట నగరాల్లో ఫుడ్ సేప్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్ లోని రెస్టారెంట్లు, బేకరీలలో తనిఖీ చేశారు. గోల్డెన్ డ్రాగన్ రెస్టారెంట్, చిల్లీస్ రెస్టారెంట్, సర్వి బేకరి అండ్ రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు గుర్తించారు. పాడైన చికెన్ అమ్ముతూ,, నాన్ వెజ్ పదార్దాలలో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపారని గుర్తించారు.
ఇక కిచెన్ రూంలో .. బొద్దింకలు.. ఎలుకలు.. ఉన్నాయని.. వంటగది పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉందని నోటీసులు జారీ చేశారు. గడువు తేది ముగిసిన ప్రొడక్ట్స్ వాడుతూ.. వెజ్ నాన్ వెజ్ ఒకే ఫ్రిజ్లో స్టోర్ చేస్తున్నట్టు గుర్తించారు. సార్వీ బేకరి అండ్ రెస్టారెంట్ లో లేబుల్స్ లేకుండా ఉస్మానియా బిస్కెట్స్, బ్రెడ్ ప్యాక్ చేసి అమ్ముతున్నారు. తుప్పు పట్టిన ఫ్రిడ్జిలో ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేస్తున్నారు.