- పాడైపోయిన చికెన్, ఫంగస్ సోకిన కూరగాయల గుర్తింపు
పటాన్చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో పాడైపోయిన చికెన్, ఫంగస్ఉన్న కూరగాలయను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఆదివారం అధికారులు వర్సిటీ బాయ్స్హాస్టల్మెస్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా తాగునీటి ట్యాంక్తుప్పు పట్టి ఉండడం, ఉపయోగించిన నూనె వాడడం, కూరగాయలు ఫంగస్ సోకి ఉండటం గుర్తించినట్లు జిల్లా అధికారి ధర్మేందర్ తెలిపారు. దాదాపు 224 కిలోల పాడైపోయిన పచ్చి చికెన్, గడువు ముగిసిన టీ, కాఫీ పౌడర్, స్ప్రింగ్ రోల్, లేబిల్ లేని బిస్కెట్స్ గుర్తించినట్లు చెప్పారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు