తార్నాకలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..

తార్నాకలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..

హైదరాబాద్ లోని తార్నాకలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తార్నాకలో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు యజమానికి నోటీసులు జారీ చేశారు. స్థానిక ఝాన్సీ ఇండస్ట్రీస్ లో శుక్రవారం ( నవంబర్ 15, 2024 ) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఈ తనిఖీల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు అధికారులు.

తయారీ కేంద్రంలో నిల్వ ఉంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ శాంపిల్స్ ని సేకరించిన అధికారులు టెస్టింగ్ కోసం శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. ఆహార పదార్థాల కల్తీని సీరియస్ గా తీసుకున్న అధికారులు ఇటీవల హోటళ్లు, రెస్టారెంట్లపై వరుసగా తనిఖీలు నిర్వహించి ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కల్తీకి అడ్డుకట్ట పడటంలేదు.