లక్డీకాపుల్ లోని న్యూ ఫిష్‌ల్యాండ్‌ హోటల్ కిచెన్‌లో ఎలుకలు

లక్డీకాపుల్  లోని  న్యూ ఫిష్‌ల్యాండ్‌ హోటల్  కిచెన్‌లో ఎలుకలు

గ్రేటర్ హైదరాబాద్ లో ఫుడ్ సేప్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.  లక్డీకపూల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు  తనిఖీలు చేపట్టారు. అశోక, న్యూ ఫిష్  ల్యాండ్ హోటల్ లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. న్యూ ఫిష్ హోటల్ లోకి వెళ్లగానే...అధికారులకు కిచెన్ లో ఎలుకలు ఎదురుపడ్డాయి.  అశోక హాటల్లో గడువు తీరిన ఆహార  పధార్థాలు బయటపడ్డాయి. 

అలాగే కిచెన్లు కూడా అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తించారు అధికారులు.  సింథటిక్ ఫుడ్ కలర్‌‌ను కూడా కూడా అధికారులు గుర్తించారు. ఇటీవల సిటీలోని చాలా ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్స్ లో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎక్కడ చూసినా..కుళ్లిన ఆహార పధార్థాలను గుర్తించారు. అటువంటి హోటల్స్ కు నోటీసులు జారీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.