శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు

శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు

శ్రీ చైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. శనివారం ( జనవరి 25, 2025 ) తనిఖీలకు వెళ్లిన అధికారులకు శ్రీ చైతన్య సెంట్రల్ కిచెన్ లో ఎలకలు, బొద్దింకలు దర్శనమిచ్చాయి. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించామని ఎక్స్ పైర్ అయిన ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు అధికారులు. కిచెన్ గోడలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయని అన్నారు అధికారులు.

Also Read : నారాయణ కాలేజీలో మూడో అంతస్థు నుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్య

అపరిశుభ్రంగా ఉన్న ఫ్రిడ్జ్ లో కూరగాయలు స్టోర్ చేసినట్లు గుర్తించామని.. నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు అధికారులు. శ్రీ చైతన్య కాలేజీ నిర్వాకంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పోసి తమ పిల్లలను కాలేజీలో చేరిస్తే కనీస బాధ్యత కూడా లేకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వండి పెడతారా అంటూ మండిపడుతున్నారు. పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్.