మండీ బిర్యానీ బాగుంటుంది కదా..! మరి కిచెన్ ఎలా ఉంటుందో చూశారా..? ఎలుకలు, బొద్దింకలతో..

మండీ బిర్యానీ బాగుంటుంది కదా..! మరి కిచెన్ ఎలా ఉంటుందో చూశారా..? ఎలుకలు, బొద్దింకలతో..

మండీ బిర్యానీ అంటే తెలియని వాళ్లు ఎవరుంటారు. ఫ్రెండ్స్ కలిసినపుడు సరదాగా అలా మండీ వెళ్లి తినొద్దాం అనుకుంటుంటారు. ఫ్యామిలీస్ కూడా వీకెండ్ టైమ్ లో మండిలో తినాలని ట్రై చేస్తుంటారు. మండి సెటప్.. టేస్టీ గురించి తెలిసిన వాళ్లు ఫ్రీక్వెంట్ గా వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇది చదివాక మండీకి వెళ్లడానికి కాస్త ఆలోచించాల్సిందే. 

తాజాగా సోమవారం (మార్చి 24) ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు మండి రెస్టారెంట్స్ లలో తనిఖీలు నిర్వహించారు. కిచెన్ లు పరిశీలించిన తర్వాత అధికారులు కళ్లు బైర్లు కమ్మే పరిస్థితులను చూసి షాక్ అయ్యారు.  బంజారాహిల్స్ లోని అరేబియన్ మండి 36, ఖైరతాబాద్ లోని మండి టౌన్, మండి కింగ్ రాయల్ రెస్టారెంట్లను తనిఖీ చేశారు అధికారులు. బాగా పేరు పొందిన మండీ హోటెల్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు తేల్చారు. 

కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కిచెన్ లో ఎలుకలు, బొద్ధింకలు తిరుగుతుండటం చూసీ ఆగ్రహానికి గురయ్యారు. వీటికి తోడు పాడైన చికెన్ వాడుతుండటం.. నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తుడటం గుర్తించారు. 

ALSO READ | హైదరాబాద్లో ఆశావర్కర్ల ఆందోళన ఉద్రిక్తత

తుప్పు పట్టిన ఫ్రిడ్జ్ లో నాన్ వెజ్ స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. తుప్పు పట్టిన కత్తులతో కూరగాయలు కటింగ్ చేస్తుండటం చూసి ఆందోళనకు గురయ్యారు. ఎంతో బ్రాండ్ ఉంది కదా అని ఇష్టంగా వచ్చిన కస్టమర్స్ కు కుళ్లిపోయిన ఐటెమ్స్ తో బిర్యానీ, కబాబ్స్ సర్వ్ చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతా ప్రమాణాలను పాటించని మండి రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.