ఇంద్రకీలాద్రికి మరోసారి నాణ్యత లేని సరుకులు.. వెనక్కి పంపిన అధికారులు..

ఇంద్రకీలాద్రికి మరోసారి నాణ్యత లేని సరుకులు.. వెనక్కి పంపిన అధికారులు..

తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చినప్పటి నుండి.. అన్ని ఆలయాల్లో ప్రసాదం తయారీకి వాడే నెయ్యి, ఇతర సామగ్రిపై నిఘా పెరిగింది. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రికి నాణ్యత లేని సరుకుల పంపిణీ తెరపైకి వచ్చింది. గత 10రోజుల్లోనే పలుమార్లు కిస్మిస్ ను వెనక్కి పంపటం చర్చనీయాంశం అయ్యింది. తాజాగా మరోసారి కిస్మిస్ ను వెనక్కి పంపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.

శనివారం ( అక్టోబర్ 5, 2024 ) 200 బాక్సుల కిస్‌మిస్‌లను వెనక్కి పంపిన ఫుడ్‌ సెఫ్టీ అధికారులు. దసరా ఉత్సవాల్లో మొదటిరోజు పెద్దసైజులో కిస్‌మిస్‌ సరఫరా చేసిన కాంట్రాక్టర్‌... ఇప్పుడు నాణ్యత, సైజు తక్కువగా ఉన్న సరుకు పంపటంతో వెనక్కి పంపారు ఫుడ్‌ సెఫ్టీ అధికారులు. అయితే.. దుర్గగుడి నుంచి ఇప్పటివరకు 10 రోజుల వ్యవధిలో 3 సార్లు సరుకులు వెనక్కి పంపటం చర్చకు దారి తీసింది.