హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఓనర్లకు నోటీసులు

హోటళ్లలో  ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఓనర్లకు నోటీసులు

 హైదరాబాద్ లోని హోటళ్లలో జీహెచ్ఎంసీ  ఫుడ్ సేఫ్టీ అధికారుల  తనిఖీలు కొనసాగుతున్నాయి.   ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్‌ మార్కెట్లు, ఐస్‌ క్రీం పార్లర్లకు నోటీసులు ఇచ్చారు అధికారులు.  

 మలక్‌పేట, శివాలయ నగర్‌, బేగం బజార్, పేట్ బషీరాబాద్ తదితర ప్రాంతాల్లోనీ ఫుడ్ షాప్, హోటళ్లలో  తనిఖీలు చేశారు.  కిచెన్ లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు. అలాగే  గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఉన్నట్లు తేల్చారు   ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్.  పలు శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌ కు పంపారు అధికారులు.  దీంతో రూల్స్ పాటించని హోటల్స్ ,షాపుల యాజమానులకు నోటీసులిచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.

Also Read:-బెంగళూరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ : హైదరాబాద్ లో డ్రగ్స్ బిజినెస్..