సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట పట్టణంలో బుధవారం డీమార్ట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించారు. జోనల్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి, సూర్యాపేట ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ లూస్ గా అమ్ముతున్న టీ పౌడర్ కల్తీ ఉన్నట్లు అనుమానించి, శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు.
ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్ట్ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార పదార్థాలలో రంగులు హానికరమైన కెమికల్స్ ఉపయోగించవద్దని యాజమాన్యాన్ని హెచ్చరించారు. నాణ్యతలేని,శుభ్రత పాటించని పలు దుకాణాల వారికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం కల్తీగా అనుమానించి సుమారు 20 కేజీల టీ పౌడర్ సీజ్ చేశారు.