హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లలో రోజురోజుకు కల్తీ ఫుడ్ పెరుగుతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం ఏదో ఒక చోట దాడులు చేసినా నిర్వాహకులు తీరు మారడం లేదు. కల్తీ పధార్థాలు ,పాడైన కూరగాయలు, కాలం చెల్లిన ఐటమ్స్ వాడి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు.
లేటెస్ట్ గా అత్తాపూర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. కాలిఫోర్నియా బురిటో రెస్టారెంట్ లో కిచెన్ లో తనిఖీలు చేసిన అధికారులు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కిచెన్ లో బొద్దింకలు .. కుళ్లిపోయిన కాలీఫ్లవర్ ఉపయోగించి వంట చేస్తున్నట్లు గుర్తించారు. మజ్లిస్ కల్చర్ రెస్టారెంట్ లో గడువు ముగిసిన ఫ్రూట్ సిరప్, కేవ్రా వాటర్, ఫ్రూట్ క్రష్ వినియోగిస్తున్నారు. మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు లేని పుడ్ హ్యాండ్లర్ లు వాడుతున్నారు. అలాగే సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.