సికింద్రాబాద్లో ఈ షవర్మ సెంటర్స్లో తిన్నారా..? అరెరె.. ఎంత పనైంది..!

సికింద్రాబాద్లో ఈ షవర్మ సెంటర్స్లో తిన్నారా..? అరెరె.. ఎంత పనైంది..!

సికింద్రాబాద్: సికింద్రాబాద్లోని షవర్మ సెంటర్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ముజ్ తాబా గ్రిల్స్, శాంధార్ షవర్మ, రోల్స్ ఆన్ వీల్స్, ఆసియన్ చో, సింక్ షవర్మ సెంటర్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు గుర్తించారు. 

షవర్మ తయారు చేసే చోటు అపరిశుభ్రంగా ఉందని అధికారులు గుర్తించారు. షవర్మలో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నట్లు తనిఖీల్లో తేలింది. మాంసం, పన్నీర్ ఎలాంటి లేబుల్, ఎక్స్పెయిరీ డేట్ లేకుండా స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు. షవర్మ సెంటర్స్ వెజ్, నాన్వెజ్ ఐటమ్స్ ఒకే దగ్గర స్టోర్ చేస్తున్నాయి. 

జంట నగరాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్ ఫోర్స్ బృందాలు ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ కొండాపూర్లోని​శరత్ ​సిటీ మాల్లోని రెస్టారెంట్లలో ఫుడ్​సేఫ్టీ టాస్క్​ఫోర్స్​ అధికారులు శుక్రవారం(అక్టోబర్ 18, 2024) తనిఖీలు చేశారు. 

చట్నీస్​ రెస్టారెంట్​, అల్పాహార్​ టిఫిన్స్‌‌లో సోదాలు నిర్వహించారు. చట్నీస్​ రెస్టారెంట్​లోని ఫుడ్ స్టొరేజీ​ ఏరియాల్లో, కిచెన్​లో బొద్దింకలను గుర్తించారు. పురుగులు పట్టిన గోధుమ పిండి, రవ్వను, కుళ్లిపోయిన ఉల్లిగడ్డలు, క్యాబేజీని వంటల్లో వాడుతున్నట్లు నిర్ధారించారు. అదే విధంగా అల్పాహార్​ టిఫిన్స్​లో డస్ట్​ బిన్లు ఓపెన్​ చేసి ఉండడం, వంట పాత్రలపై మూతలు పెట్టడం లేదని గుర్తించారు. ఫుడ్​పై మూతలు లేకుండానే ఫ్రిజ్​లో స్టోర్​ చేసినట్లు నిర్ధారించారు.

హైదరాబాద్లోని బేగంపేట ప్రకాశ్ నగర్ లో 7 క్వింటాళ్ల కుళ్లిన చికెన్​ను  అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్ఎంసీకి చెందిన ఆహార భద్రతా విభాగం అధికారులు శుక్రవారం ప్రకాశ్  నగర్ లోని బాలయ్య చికెన్  సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 

బేగంపేట​ప్రకాశ్​నగర్​కు చెందిన బాలయ్య (36) పది నెలల క్రితం అదే ప్రాంతంలో బాలయ్య చికెన్​ సెంటర్​ పేరుతో షాపు ఓపెన్  చేశాడు. కోడి కాళ్లు, తల, ఇతర భాగాలను సేకరించి తన షాపులోని ఫ్రిజ్​లో భద్రపరుస్తున్నాడు. అలా దాచిన చికెన్​ను సిటీలోని బార్లు, కల్లు దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్  సెంటర్లకు అమ్ముతున్నాడు. 

ALSO READ : Good Food : ఇడ్లీతో ఈజీ స్నాక్స్.. ఇడ్లీ పకోడీ, ఇడ్లీ చాట్, ఇడ్లీ మంచూరియా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు..!

నెల రోజుల క్రితం సేకరించి దాచిపెట్టిన చికెన్, ఎముకలు, తల, ఇతర భాగాలను అధికారులు  స్వాధీనం చేసుకున్నారు. అదంతా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఆ మాంసానికి కెమికల్స్​వేసి వివిధ దుకాణాలకు అమ్ముతున్నాడని అధికారులు గుర్తించారు.