వెలుగు కథనానికి స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు
ఎల్బీనగర్, వెలుగు: సిటీ శివారులోని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో బుధవారం ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొన్ని హోటళ్లకు ఫైన్లు విధించారు. మరికొన్నింటికి నోటీసులు జారీ చేశారు. బుధవారం ‘‘ఫుడ్ బాగోలేదు.. ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు లేవు”హెడ్డింగ్‌తో ‘వెలుగు’లో పబ్లిష్అయిన స్టోరీకి జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. గడ్డిఅన్నారంతోపాటు ఎల్బీనగర్లోని పలు హోటళ్లకు ఫైన్లు విధించినట్లు ఫుడ్‌సేఫ్టీ అధికారులు తెలిపారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలోని హోటళ్లపై ఫిర్యాదు చేయాలనుకుంటే 79950 09088,79950 79800,99890 95487 నంబర్లకు కాల్చేయాలన్నారు.