సికింద్రాబాద్ కార్కానాలోని వాక్స్ బేకరీలో తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. బేకరీ నిర్వాహకులు రమ్ మద్యం వాడుతూ ప్లమ్ కేక్స్ తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అనుమతి లేదన్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. కేక్ ల తయారీలో రమ్ మద్యం వాడుతున్నట్లు చూపకుండా అమ్ముతున్నారు. అపరిశుభ్ర వాతావరణం, ఇతర కెమికల్స్ వాడుతూ కేక్ లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు.
మేడ్చల్ జిల్లా అల్వాల్,మచ్చబొల్లారంలో పలు బేకరీల్లో తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కాలంచెల్లిన ఫుడ్ ఐటమ్స్ తో కేక్ లు తయారు చేస్తున్నట్టు గుర్తించారు.కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్టు తెలిపారు. ఎక్స్ పైరీ అయిన కోకోనట్ పౌడర్, కేసర్, వెనీలా ఫ్లేవర్, పైన్ యాపిల్ సీరప్ లను సీజ్ చేశారు. అపరిశుభ్రంగా ఉన్న ఫ్రిడ్జ్ లో ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేస్తున్నారని చెప్పారు. ప్లాస్టిక్ డ్రమ్స్ లో కేక్ ల తయారు చేస్తున్నట్టు తెలిపారు.ఫుడ్ సేఫ్టీ నియమాలు పాటించకుండా కేక్ లు తయారు చేస్తున్న బేకరీ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.