జూబ్లీహిల్స్,వెలుగు : ఫుడ్ సేప్టీ అధికారులు జూబ్లీహిల్స్‌లోని పలు పబ్‌లు, రెస్టారెంట్లపై ఆదివారం దాడులు నిర్వహించారు. రోడ్డు నంబరు 45లోని డైలీ రిచువల్స్, హార్ట్ కప్ కాఫీ రెస్టారెంట్లో తనిఖీలు చేశారు. కిచెన్‌లో బొద్దింకలు , కాలం చెల్లిన ఆహార ఉత్పత్తులను గుర్తించారు.
ఫ్రిజ్‌లు శుభ్రం చేయక పోవడం, 6 కిలోల టమాటో పేస్ట్ ,10 కిలోల వనస్పతి, బంగాళా దుంపలు, కూరగాయలు పాడై పోయినట్టు అధికారులు గుర్తించారు. దీంతో హోటళ్లపై అధికారులు కేసులు నమోదు చేశారు.