ఈ పండ్లు న్యాచురల్గా పండించినవేనా..? మొజాంజాహీ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

ఈ పండ్లు న్యాచురల్గా పండించినవేనా..? మొజాంజాహీ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

హైదరాబాద్ లో ఫ్రూట్స్ అంటే ఎక్కువగా గుర్తొచ్చేంది కొత్తపేట్ మార్కెట్.. ఆ తర్వాత మొజాంజాహీ ఫ్రూట్ మార్కెట్. కోటి, నాంపల్లికి మధ్యలో ఎప్పుడూ ఫుల్ రష్ తో ఉండే మార్కెట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మామిడి పండ్ల సీజన్ హైదరాబాద్ లో ముందుగానే రావడంతో తనిఖీలు మొదలు పెట్టారు అధికారులు. 

మామిడి పండ్లు, పుచ్చకాయలు సీజన్ ను దృష్టిలో ఉంచుకొని కార్బైడ్ వాడుతున్నారా లేక సహజంగా పండించిన పండ్లేనా అని పరీక్షించారు. ఆహార భద్రత ప్రమాణాలకు విరుద్ధంగా కార్బైడ్ వినియోగించి మామిడి పండ్లను పండిస్తున్నట్లు గుర్తించారు. కార్బైడ్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని పండ్ల వ్యాపారులకు సూచించారు.

పండ్ల పక్వానికి అనుమతించిన పదార్థాలను మాత్రమే వినియోగించాలని అవగాహన కల్పించారు. కార్బైడ్ ను ఉపయోగించి మామిడి పండ్లను పండిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్బైడ్ వలన ఆరోగ్య సమస్యలు వస్తాయని, చిన్న పిల్లల్లో మరింత అధికంగా వచ్చే అవకాశం ఉండటంతో కార్బైడ్ వినియోగించినట్లు తెలిస్తే కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.