కెమికల్స్​తో నెయ్యి తయారీ .. శాంపిల్స్ కలెక్ట్.. రిపోర్టు రాగానే చర్యలు

కెమికల్స్​తో నెయ్యి తయారీ .. శాంపిల్స్ కలెక్ట్.. రిపోర్టు రాగానే చర్యలు
  •  ఫ్రైడ్​ గీ అండ్​ కర్డ్​లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు హోటళ్లు, రెస్టారెంట్లలో దాడులు కొనసాగిస్తున్నారు. గడిచిన మూడు రోజుల్లో జరిపిన అధికారులు తనిఖీల్లో సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 12 లోని ఫ్రైడ్ గీ అండ్ కర్డ్ లో కెమికల్స్ తో నెయ్యి తయ్యారు చేస్తున్నారని మాసబ్ ట్యాంక్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. నెయ్యి తయారీలో డిఫరెంట్​క్రీమ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. క్రీమ్ ప్యాకెట్లకు ఎలాంటి లేబుల్స్​లేవని, తయారు చేసిన నెయ్యికి లేబుల్స్ లేకుండానే విక్రయిస్తున్నారని గుర్తించారు.

 నెయ్యి శాంపిల్స్​ను నాచారంలోని ల్యాబ్ కి పంపించారు. నెలరోజుల్లో రిపోర్ట్ రానుంది. కల్తీ  చేస్తున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. అలాగే మాసబ్ ట్యాంక్ మోజోస్ పిజ్జాలో స్టోర్​లో దాడులు తనిఖీలు చేశారు. ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన ఫుడ్ ని, లేబుల్స్ లేని ఫుడ్​ఐటమ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. మలక్‌‌‌‌పేటలోని   విజయ సాయి బాయ్స్ హాస్టల్, బేగంబజార్‌‌‌‌లోని ఆకాశ్​ట్రేడింగ్ కంపెనీ, చంద్ర ఏజెన్సీస్, పేట్ బషీరాబాద్‌‌‌‌లోని కాంచి కేఫ్, విజిలింగ్ బ్రూ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్లలో నిల్వ చేసిన ఆహార పదార్థాల శాంపిల్స్​తీసుకున్నారు. నోటీసులు జారీ చేశారు.