మీ పిల్లలు నారాయణ కాలేజీలో చదువుతున్నారా..?...ఎలాంటి ఫుడ్ తింటున్నారో తెలిస్తే యాక్ థూ అంటారు..!

మీ పిల్లలు నారాయణ కాలేజీలో చదువుతున్నారా..?...ఎలాంటి ఫుడ్ తింటున్నారో తెలిస్తే యాక్ థూ అంటారు..!

ఒకటి.. ఒకటి.. రెండు.. రెండూ అంటూ ర్యాంకులు ప్రకటించుకోవటం వరకు ఓకే.. ఇలా ర్యాంకులు ప్రకటించుకునే నారాయణ కాలేజీల్లో మీ పిల్లలు చదువుతున్నారా.. నారాయణ కాలేజీ హాస్టల్ లో మీ పిల్లలను చేర్పించారా.. అయితే ఒక్కసారి కాలేజీ హాస్టల్ లోని కిచెన్ లోకి వెళ్లి కూడా ఓసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. మీ పిల్లలు ఎలాంటి ఫుడ్ తింటున్నారో తెలిస్తే యాక్.. థూ అంటారు.. అవును.. నారాయణ కాలేజీ హాస్టల్స్ ను భోజనం వండి పంపించే సెంట్రల్ కిచెన్ ఉంది.. అది రంగారెడ్డి జిల్లా కుంట్లూరులో ఉంది. ఇక్కడి నుంచే నారాయణ కాలేజీ హాస్టల్స్ ను ఫుడ్ వండి పంపిస్తుంటారు.. ఈ కిచెన్ పై రైడ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అవాక్కయ్యారు.. షాక్ అయ్యారు.. ఎందుకో పూర్తిగా తెలుసుకోండి పేరెంట్స్.

రంగారెడ్డి జిల్లా కుంట్లూరులో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. నారాయణ విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ పై  రైడ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. 

సిబ్బంది  కుల్లిపోయిన టమాటోలు, ఆలుతో పాటు ఇతర కూరగాయలతో వంటలు చేస్తున్నారు.  తుప్పు పట్టిన కత్తులతో కూరగాయల కటింగ్ చేస్తున్నారు. ఈగలు, బొద్దింకలు కిచెన్ లో తిరుగుతుండటంతో  ఫుడ్ సేఫ్టీ అధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నారాయణ సెంట్రల్ కిచెన్ లో వండిన ఫుడ్ ని నారాయణ విద్యాసంస్థల హాస్టల్స్ లో విద్యార్థులకు తీసుకెళ్తున్నారు నిర్వాహకులు.  అయితే లైసెన్స్ లేకుండా తొమ్మిది వెహికిల్స్ లో ఫుడ్ ని నారాయణ విద్యాసంస్థలకు తరలిస్తున్నారన్నారు.  నారాయణ సెంట్రల్ కిచెన్ నిర్వాహకులకు నోటీసులిచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.