ఇలాంటి తిండి తింటే.. చైతన్యపురిలో కొన్ని హోటల్స్ ఇలా చేస్తున్నాయా..?

ఇలాంటి తిండి తింటే.. చైతన్యపురిలో కొన్ని హోటల్స్ ఇలా చేస్తున్నాయా..?

చైతన్యపురిలో పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. శిల్పి ఎలైట్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిపోయిన కూరగాయలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్ పరిసరాలు, ఫ్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉండటంతో విస్మయం వ్యక్తం చేశారు. ఆహారంపై బొద్దింకలు తిరుగుతూ కనిపించడంతో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. బహార్ బిర్యాని కేఫ్లో కిచెన్ పరిసరాల్లో మురుగు నీటిని, ఆహారంలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఎక్స్పైర్ అయిన పెప్పర్ సాస్, చాక్లెట్ ఫ్లేవర్ సిరప్ వాడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి ఆహారాన్ని ప్రజలకు పెడుతున్నారా? అని ప్రశ్నించారు. ఇంత మురికి నీటిలో, కుళ్లిపోయిన కూరగాయలతో వంట చేస్తే ప్రజలు ఏమైపోవాలని మండిపడ్డారు. యాజమాన్యంతో మాట్లాడాలి పిలిపించాలని కోరారు. పలు చోట్లు హోటల్లు సీజ్ చేస్తున్నా యాజమాన్యం తమ వైఖరి మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్‌ ను సీజ్‌ చేస్తామని తెలిపారు.

ALSO READ | టమాటా సాస్ ఉపయోగిస్తున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయం తెలుకోవాల్సిందే..!