ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. సికింద్రాబాద్ ఆల్పా హోటల్పై కేసు

ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. సికింద్రాబాద్ ఆల్పా హోటల్పై కేసు

సికింద్రాబాద్ లోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఆల్ఫా హోటల్ పై కేసు నమోదు చేశారు. సందర్షిని హోటల్,రాజ్ బార్ అండ్ రెస్టారెంట్లో  తనిఖీలు చేశారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. 

 చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్ లోనే నిల్వ ఉంచిన మటన్ , మాంసాహార ముడి పదార్థాలను వాడుతున్నారని చెప్పారు ఫుడ్ సేప్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు.  ఆల్ఫా బ్రాండ్ ఐస్ క్రీమ్, బ్రెడ్ ప్యాకెట్లపై డేట్ లేకుండా, FSSAI సర్టిఫికెట్ వ్యాలిడిటీ అయిపోయిన .. ఫుడ్ ను కస్టమర్లకు అమ్ముతున్నట్లు గుర్తించారు. రూల్స్ కు వ్యతిరేకంగా నడుపుతున్న రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.