కొండాపూర్ ఫేమస్ హోటల్లో ఇంత దారుణమా.?.. కిచెన్ గదిలో డ్రైనేజీ వాటర్..పాడైన కూరగాయలతో వంటలు

కొండాపూర్ ఫేమస్ హోటల్లో  ఇంత దారుణమా.?.. కిచెన్ గదిలో డ్రైనేజీ వాటర్..పాడైన కూరగాయలతో వంటలు

 ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని దాడులు చేసినా హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లు తమ వైఖరిని మార్చుకోవట్లే. అపరిశుభ్రమైన వాతావరణంలో పాడైన కూరగాయలతో వంటలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.   రెండు రోజుల క్రితం మంగళ్ హాట్ చిస్తి చమాన్​లోని ఓ నాన్ ​వెజ్ ​షాపులో ఫ్రిడ్జ్​లో స్టోర్​చేసిన 12 టన్నుల మేక మాంసాన్ని ఫుడ్​సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

 లేటేస్ట్ గా కొండాపూర్ లోని కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు.  కిచెన్ అపరిశుభ్రవంగా ఉండటంతో పాటు   డ్రైనేజీ వాటర్‌ పొంగుతున్నట్లుగా  గుర్తించారు అధికారులు. చెడిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన ఇతర వస్తువుల వాడుతున్నట్లు గుర్తించారు. హోటల్ లో పని చేస్తున్న  స్టాఫ్ కూడా కనీసం హ్యాండ్ గ్లోవ్స్, హెడ్ కాప్స్ కూడా ధరించడం లేదని తెలిపారు  ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా డిస్ ప్లే చేయలేదని చెప్పారు