కరీంనగర్: కరీంనగర్లోని పలు హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ హెడ్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో కరీంనగర్ మైత్రి హోటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.
హోటల్ రిఫ్రిజిరేటర్లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయలేదని తేలింది. ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో భారీగా మాంసపు ఉత్పత్తులను నిలువ చేసి, హానికర ప్రమాదకరమైన రంగులను కలిపిన చికెన్ డ్రమ్ స్టిక్స్ను గుర్తించారు. తుప్పు పట్టిన వంట పాత్రలను వంటలు తయారు చేయడానికి ఉపయోగించడమే కాకుండా బూజు పట్టిన కూరగాయలను వాడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. హోటల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 25 వేల విలువగల 20 కేజీల మాంసపు ఉత్పత్తులను చెత్తలో పడేశారు.
Also Read:-ఈ అమ్మాయిలకు సిగ్గూ శరం ఉందా అంటూ తిట్టిపోస్తున్నారు..!
అదే విధంగా మిఠాయివాలా స్వీట్ షాప్ నందు కూడా తనిఖీలు చేశారు. ఈ స్వీట్ షాప్లో మోతాదుని మించిన కృత్రిమ హానికరమైన రంగులను స్వీట్స్ తయారీకి ఉపయోగించినట్లు గుర్తించారు. కేక్స్, స్వీట్స్ తయారీలో గడువు ముగిసిన ముడి సరుకులు ఉపయోగించారని వెల్లడైంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ లేని బ్రెడ్ ప్యాకెట్స్, లేబుల్ డిఫెక్ట్స్ గుర్తించిన అధికారులు7 వేల రూపాయల విలువైన పనికిరాని ఆహార పదార్థాలను చెత్తలో వేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేసి అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న సదరు మిఠాయి వాలా యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.