హైదరాబాద్ సిటీ, వెలుగు: పీవీ మార్గ్‌లోని మినర్వా రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) సీఈఓ కమలవర్ధన్ రావు, ఐపీఎం డైరెక్టర్ శివలీల తనిఖీ చేశారు. గురువారం ఓ కస్టమర్‌కు సాంబార్ రైస్‌లో బొద్దింక రావడంతో హోటల్‌ను పరిశీలించి శాంపిళ్లు సేకరించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో రాడిసన్ హోటల్ లో శుక్రవారం సెంట్రల్, స్టేట్ ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారుల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిటీకి వచ్చిన సీఈఓ సడెన్ గా మినర్వా హోటల్లో తనిఖీలు నిర్వహించారు. శాంపిళ్లను ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వెహికిల్ లో టెస్ట్ చేశారు. అక్కడ టెస్టు చేసిన పదార్థాలు బాగానే ఉన్నట్లు గుర్తించారు. ఆయిల్, వాటర్, ఫుడ్ శాంపిళ్లను నాచారం ల్యాబ్‌కు పంపించారు.
ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలు పాటించని రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. అనంతనం శివలీల మాట్లాడుతూ... ఫుడ్ సేఫ్టీ ర్యాంకింగ్‌లో తెలంగాణ వెనుకబడిందన్న ప్రచారం అవాస్తవమన్నారు. తనిఖీలు చేయడంతో అధికారులు అలెర్ట్ గా ఉన్నారన్నారు.