మేకగూడలో బేకరీపై ఫుడ్ సేఫ్టీ రైడ్స్..14లక్షల విలువైన ఎక్స్పైరీ ఐటమ్స్ సీజ్

రంగారెడ్డి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. జిల్లా పరిధిలోని బేకరీలపై దాడులు చేశారు. కాలం చెల్లిన బేకరీ ఫుడ్స్ ను సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మేకగూడలోని హేమాంక్షి బేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ పై ఫుడ్ సేఫ్టీ దాడులు చేశారు. బేకరీలో ఎక్స్ పైర్ అయిన ఐటమ్స్ వాడుతున్నట్టు గుర్తించారు. దాదాపు 14 లక్షల రూపాయలు విలువ చేసే కాలం చెల్లిన ముడి సరుకులు సీజ్ చేశారు. 

హేమాంక్షి బేకరీ నుంచి బేకరీ పదార్థాలను దేశ విదేశాలకు సప్లయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్ లో బేకరీ ఫుడ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో FSSAI నిబంధనలకు విరుద్ధంగా 9 క్వింటాళ్ళ కోకో పౌడర్, 165 కిలోల గ్లిజరా్ మోనోస్టిరేట్, 170 కేజీల కేక్ జెల్, 360 కేజీలలో హైడ్రోజనెటెడ్, వెజిబేటబుల్ ఫ్యాడ్, 375 కిలోల మిల్క్ పౌడర్ లతో పాటు కాలం చెల్లిన ముడి సరుకులు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. బేకరీపై కేసు నమోదు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. 

ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేస్తున్నారు.. అధికారుల తనిఖీల్లో రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీల్లో ఆహార నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. 

క్కువ కాలం నిల్వ ఉంచిన చికెన్, మటన్లతో ఫుడ్ తయారీ, అపరిశుభ్రమైన కిచెన్లలో ఆహార పదార్థాల తయారీతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఘటనలతో నగర వాసులు బయటి ఫుడ తినాలంటేనే జంకుతున్నారు.