బల్దియా కన్ను.. ఇక ప్రైవేట్ హాస్టళ్లపై

బల్దియా కన్ను.. ఇక ప్రైవేట్ హాస్టళ్లపై
  • ఇటీవల దాడుల్లో బయటపడ్డ లోపాలు
  • ఫుడ్​క్వాలిటీ పూర్, శుభ్రత నిల్..​ 
  • సమస్యల పరిష్కారానికి త్వరలో కమిటీ  
  • కమిటీలో హెల్త్, శానిటేషన్, ఫైర్ డిపార్ట్​మెంట్ల అధికారులు  
  • వారి సూచనల ఆధారంగా చర్యలు  

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో లెక్కకు దొరకనన్న ఉన్న ప్రైవేట్ హాస్టల్స్ లో ఇటీవల జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా.. ఒక్కటంటే ఒక్క దాంట్లో కూడా క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేయడంలేదని తేలింది. దీనికితోడు ఏమాత్రం శుభ్రత పాటించడంలేదని గుర్తించారు. ఆహార పదార్థాల్లో కొన్నిచోట్ల ఎక్స్​పైరీ అయిన ఐటమ్స్​వాడుతున్నట్టు తేలగా, ఇంకొన్నిచోట్ల కుళ్లిన కూరగాయాలు వాడుతున్నట్టు తెలుసుకున్నారు.

దీంతో వారికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఇకపై హాస్టల్స్ లో క్వాలిటీ ఫుడ్ తో పాటు క్లీనింగ్ పాటించే విధంగా చూడాలని బల్దియా ప్లాన్​చేస్తోంది. ఇందులో భాగంగా హెల్త్, శానిటేషన్, ఫైర్ డిపార్టమెంట్ లతో కలిపి ఓ కమిటీని వేసేందుకు కమిషనర్ ఆమ్రపాలి నిర్ణయం తీసుకున్నారు. స్టడీ టూర్ నుంచి మేయర్ విజయలక్ష్మి రాగానే ఆమెతో చర్చించి కమిటీ ఏర్పాటు చేయనున్నారు.  

సంపాదన కోసమే అన్నట్లుగా..

గ్రేటర్ లో ప్రైవేట్ హాస్టల్స్ విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. అసలు నగరంలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయో జీహెచ్ఎంసీ వద్ద లెక్క లేదు. అయినా10వేలకి పైగానే హాస్టల్స్ ఉన్నట్లు ఓ అంచనాకు వచ్చింది. ఇందులో మినిమమ్​రూల్స్​పాటించడకుండా ఏర్పాటు చేస్తున్నవి ఎన్నో. అపార్ట్​మెంట్లలోని డబుల్, ట్రిపుల్​బెడ్ రూమ్ ఫ్లాట్లలో రూమ్స్ ఏర్పాటు చేసి సెల్లార్లలో కిచెన్ తో పాటు డైనింగ్ హాల్ పెట్టి రన్​చేస్తున్నారు. ఇంకొన్నిచోట్ల ఫుడ్ ఎక్కడ వండుతున్నారో కడా తెలియదు. తీసుకొని వచ్చి వడ్డించి వెళ్లిపోతారు. కొన్ని హోటల్స్ లో కూడా హాస్టల్స్ కొనసాగుతున్నాయి.

కింద హోటల్ నడుపుతూ పైన రూమ్స్ లో ఏదో నామ్ కే వాస్తేగా బెడ్స్ ఏర్పాటు చేసి హాస్టల్స్ రన్ చేస్తున్నారు. హాస్టల్స్ ను  బట్టి నెలకు రూ.5 వేల నుంచి రూ.12 వేల వరకు తీసుకుంటున్నారు. వీటికి పేర్లు కూడా వేరుగా ఉంటున్నాయి. నార్మల్​హాస్టల్స్, వర్కింగ్​ఉమెన్స్​హాస్టల్స్, లగ్జరీ హాస్టల్స్, ఎగ్జిక్యూటివ్​హాస్టల్స్​అంటూ పేర్లు మారుస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. వేలకు వేలు తీసుకుంటున్నా కొన్ని చోట్ల కనీస వసతులు కూడా కల్పించడం లేదు. కొన్ని హాస్టళ్లలో రూమ్స్అగ్గిపెట్టెల్లా ఉంటున్నాయి. 

పర్మిషన్​లేనివి ఎన్నో

నగరంలోని చాలా వరకు హాస్టల్స్​అసలు పర్మిషన్​తీసుకోవడం లేదు. కొందరు హోటల్ పేరుతో రన్ చేస్తుండగా, మరికొందరు అకామిడేషన్ పేరుతో ట్రేడ్ లైసెన్సులు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీకి ప్రతిఏటా ట్రేడ్ లైసెన్స్ ల రూపంలో రూ.80 కోట్లకి పైగా ఆదాయం వస్తుండగా, ఇందులో ఈ ఏడాది 92,000 ట్రేడ్ లైసెన్సులకు సంబంధించి రూ. 86 కోట్లు వచ్చింది. 

ఇందులో హాస్టల్స్ ఎన్ని ఉన్నాయన్న వివరాలు మాత్రం లేవు. కమిటీ ఏర్పడిన తర్వాత కావాల్సిన సమాచారం అంతా దొరుకుతుందని, వారి సూచనల ఆధారంగా ఫుడ్ క్వాలిటీతో పాటు హాస్టల్స్ లో శుభ్రత మెయింటెయిన్​చేసేలా చూడొచ్చని అధికారులు అంటున్నారు.