- హబ్సిగూడ, నాచారంలోని మను కిచెన్, సుప్రభాత్ హోటళ్ల లో కుళ్లిపోయిన కూరగాయలు
- సీసీఎంబీ కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకలు
- మరోసారి రిపీటైతే హోటళ్లను సీజ్ చేస్తామని ఆఫీసర్ల హెచ్చరిక
నాచారం, వెలుగు: నగరంలోని హబ్సిగూడ, నాచారం ప్రాంతాల్లోని పలు హోటళ్లు, క్యాంటీన్లలో జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఆదివారం తనిఖీలు చేపట్టారు. హబ్సిగూడలోని ద సెంటర్ఫర్సెల్యూలార్ అండ్మాలిక్యూలార్బయాలజీ (సీసీఎంబీ) క్యాంటీన్‌లో తనిఖీలు నిర్వహించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైంటిస్టులకు ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న ఈ క్యాంటీన్ కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకలు తిరగడం చూసి ఆఫీసర్లు షాక్ అయ్యారు.
వంటకాల్లో కాలం చెల్లిన రసాయన పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. నాచారంలోని మను కిచెన్రెస్టారెంట్, సుప్రభాత్హోటల్ కిచెన్‌లో కుళ్లిపోయిన టమాటాలు, పాడైన మొలకలెత్తిన ఆలుగడ్డలు, గడువు ముగిసిన పన్నీర్, మష్రూమ్ ప్యాకెట్ల ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అనంతరం నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడొద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే హోటళ్లను సీజ్చేస్తామని హెచ్చరించారు.