Food safety raids : మిఠాయి వాలా, నీలోఫర్ కేఫ్‌ల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్

హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై సెప్టెంబర్ 3న తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించింది. రైడ్స్ లో అధికారులకు ఎన్నో అక్రమాలు బయటపడ్డాయి. బంజారా హిల్స్ లోని నీలోఫర్ కేఫ్, రాజా డీలక్స్, హైకూ రెస్టారెంట్లలో దాడులు నిర్వహించారు. వనస్థలిపురంలోని మిఠాయివాలా స్వీట్ షాప్ లో కూడా టాస్క్‌ఫోర్స్ అధికారులు సోదాలు చేశారు.

బంజారాహిల్స్‌లోని నీలోఫర్ కేఫ్‌లో కిచెన్ లో  గడువు ముగిసిన చీజ్, కాశ్మీరీ కారం పొడి, కాల్చిన వేరుశెనగలు ఉన్నాయి. రాజా డీలక్స్‌ రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించగా.. డ్రైనేజీలో నీరు నిలిచిపోయింది. తలుపులు, కిటికీలు బార్లా తెరిచి ఉన్నాయి. అంతేకాదు పచ్చి మాంసం నిల్వ చేయడానికి ఉపయోగించే రిఫ్రిజిరేటర్ కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. 

Also Read :- బంగాళాఖాతంలో అల్పపీడనం.. బెజవాడకు మళ్లీ భారీ వర్షాలు

బంజారాహిల్స్‌లోని మరో ప్రముఖ రెస్టారెంట్ హైకూలో జీలకర్ర, నల్ల నువ్వులు, చింతపండు, పిండి వంటి ఆహార పదార్థాలు ఎక్స్‌పెయిరీ డేట్ అయిపోయినట్లు గుర్తించారు. ఆయా షాపు ఓనర్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫుడ్ అడల్ట్రేషన్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

వనస్థలిపురంలోని ప్రశాంతి నగర్‌లో ఉన్న మిఠాయివాల స్వీట్ షాప్ లో కూడా అధికారులు దాడులు చేశారు. స్వీట్స్ ప్యాకింగ్ చేసే ఏరియా అపరిశుభ్రంగా ఉందని, ఆహార పదార్థాల లేబులింగ్, రికార్డు కీపింగ్ రూమ్ లు నీట్ గా లేవని అధికారులు మండిపడ్డారు. ఎక్స్ పెయిరీ అయిపోయిన స్వీట్స్ తోపాటు ఇంకా అనేక రూల్స్ బ్రేక్ చేసినట్లు అధికారులు గుర్తించారు.