హోటల్లో ఫుడ్ నీట్‌గా లేకుంటే ఈ యాప్‪లో కంప్లెయింట్ చేస్తే.. వెంటనే FSSAI రైడ్స్

హోటల్లో ఫుడ్ నీట్‌గా లేకుంటే  ఈ యాప్‪లో కంప్లెయింట్ చేస్తే.. వెంటనే FSSAI రైడ్స్

ఈరోజుల్లో ఫుడ్ ఇంట్లో వండుకొని తినడం కంటే బయట ఫుడ్ తినడానికే ఎక్కవ ప్రాధాన్యత ఇస్తున్నారు. బిజీ బిజీ లైఫ్ స్టైల్ వల్ల ప్రజలు హోటల్స్, రెస్టారెంట్స్, క్లౌడ్ కిచన్ ఇలాంటి వాటివైపు చూస్తున్నారు. హోటల్ ఫుడ్ కు డిమాండ్ పెరుగుతుండటంతో హోటల్ యాజమాన్యాలు కల్తీకి పాల్పడుతున్నారు. తయారీలో పరిశుభ్రత కూడా పాటించడం లేదు. ఇటీవల ఫుడ్ అడల్ట్రేషన్ కేసులు భారీగా బయటపడుతున్నారు. హోటల్లో ఫుడ్ నీట్ గా లేకుంటే డైరెక్ట్ గా మీరే మీ మొబైల్ ఫోన్ నుంచి కంప్లెయింట్ చేయోచ్చు. FoSCoS యాప్ లేదా వెబ్ సైట్ లో పరిశుభ్రత పాటించని, కల్తీ ఆహారం అమ్మే రెస్టారెంట్లపై ఫిర్యాదు చేయోచ్చు.

వినియోగదారులు ఓ మోబైల్ యాప్ తో నేరుగా హోటల్ పై కంప్లెయింట్ చేయోచ్చు. అదే FoSCoS యాప్, ఇది ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వారిది, గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లౌడ్ చేసుకోవచ్చు. దీంట్లో కస్టమర్స్ ఏదైనా హోటల్ లో అపరిశుభ్రమైన  ఆహారపదార్థాలు, హోటల్ లో చిచెన్ నీట్ గా లేకున్నా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఆయా ప్రాంతంలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫిర్యాదు అందిన రెస్టారెంట్ లేదా హోటల్ పై తనిఖీలు చేస్తారు.  మీరు చేసిన కంప్లెయింట్ కు ఓ టికెట్ నెంబర్ ఇస్తారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే దాడులు చేస్తారు. వారిపై చర్యలు తీసుకుంటారు. ఈ యాప్ ద్వారా అందిన రెండు ఫిర్యాదులో హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు.

రెండు టీంలుగా విడిపోయి టాస్క్ ఫోర్క్ ఆఫీసర్లు ఉప్పర్‌పల్లిలోని రాజేంద్ర నగర్‌లోని మెహ్రాబ్ రెస్టారెంట్‌, అంబర్‌పేటలోని నారాయణగూడలో ఉన్న ఇండియన్ దర్బార్ రెస్టారెంట్లపై అకస్మిక తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ FSS చట్టం 2006, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2011 ప్రకారం రూల్స్ పాటించనందుకు ఫైన్ విధించారు. మీరు కూడా ఎప్పుడైనా హోటల్ లో అపరిశుభ్రమైన ఆహార పదార్ధాలు కనిపిస్తే FoSCoS యాప్ లో ఫిర్యాదు చేయండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. >>