ఖమ్మంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. 960 కిలోల అల్లం వెల్లులి పేస్ట్ సీజ్..

తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఎక్కడిక్కడ హోటళ్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. నాణ్యత పాటించని హోటళ్లను సీజ్ చేస్తున్నారు. తాజాగా ఖమ్మంలో తనిఖీలు చేపట్టిన ఫుడ్ స్ఫటి అధికారులు భారీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను సీజ్ చేశారు. ఖమ్మంలోని రిక్కా బజార్ లోని ఓ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు కల్తీ మ్యాజిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఇంట్లో నిల్వ ఉంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ నాణ్యత లేక, దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఈ తనిఖీల్లో సుమారు 960 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ ను సీజ్ చేశారు అధికారులు. ఇదిలా ఉండగా, ఇటీవల హైదరాబాద్ లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన వరుస తనిఖీల్లో భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను సీజ్ చేశారు అధికారులు.

ALSO READ | బంగారం ధరలు భారీగా పెరిగాయ్.. రేటు తగ్గుతుందిలే అనుకుంటే మళ్లీ ఇదేంది..!