మనం డెస్క్ వద్ద పనిచేస్తున్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలసట,చికాకును ఎదుర్కోవడానికి, లేదా శక్తినిచ్చేందుకు పని మధ్యలో ఏదో ఒక అల్పాహారం తీసుకోవాలనిపించడం సాధారణం..అయితే ఇలాంటి టైంలో ఏం తినాలి..ఏం తింటే అలసట,చికాకు నుంచి బయటపడొచ్చు.. ఏం తింటే..శక్తినిస్తుంది..నిద్ర రాకుం డా మనల్ని పనికి ప్రేరేపిస్తుందో తెలుుకుందాం..
అలసట, విసుగును ఎదుర్కోవడానికి లేదా శక్తిని త్వరగా పెంచడానికి పని మధ్యలో అల్పాహారం తింటుంటాం కదా.. పని మధ్య అనారోగ్యకరమైన చక్కెరతో కూడిన స్నాక్స్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలాంటి స్నాక్స్ తినడం దృష్టిని తగ్గిస్తుంది.. నిద్ర పోయేలా చేస్తుంది. దీంతో నీరసించినట్టు ఉంటుంది. ఈ అనా రోగ్యకరమైన స్నాక్స్ ని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో భర్తీ చేసుకోవాలి. అవి..
నట్స్: బాదం, జీడీపప్పు, వాల్ నట్ లు , పిస్తా వంటి గింజలు కరకరలాడే ఆఫీసు స్నాక్స్.. అవసరమైన పోషలకాలతో ప్యాక్ చేయబడి ఉంటాయి. అవి మన మెదడు పని తీరు, మొత్తం ఆరోగ్యానికి సహాయ పడతాయి.
పండ్లు: చక్కెరతో కూడిన మంచిని కోరుకునేటప్పుడు ప్రకృతి అందించిన పండ్లను తీసుకోండి. అవసరమైన విటమిన్లతో పాటు, అవి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. అరటి, దోసకాయ, యాపిల్, ద్రాక్ష వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ మంచి ఆహారం..
మఖానా: రుచికరమైనవి తినాలని అనిపిస్తే..సంతృప్త కొవ్వు అధికంగా ఉంటే చిప్స్ కు బదులుగా మఖానాను తింటే ఎంతో ఆరోగ్యం.. తక్కువ కాలరీలు, అధిక మాంసకృత్తులు ఉంటే మఖానా రుచికరంగా ఉంటుంది.
వోట్స్, మిల్లట్స్ ఆధారిత కుకీలు: కుకీల తీపి క్రంచి నెస్ వాటిని ఒక ప్రసిద్ధ చిరుతిండి. సాధారణ పిండి కుకీలను కూడా తినకుండా.. వాటికి బదులుగా వోట్స్, మిల్లెట్ ఆధారంగా తయారు చేసిన వాటిని తింటే.. అవి చక్కెర తక్కువగా ఉండి.. మంచి పోషకాలతో నిండి ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది.