
సంగారెడ్డి టౌన్, వెలుగు: ఐదు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం డీఈఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. గుర్తింపు కార్డులు, గ్యాస్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు. అప్పులు చేసి ప్రతిరోజు భోజనం అందిస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించక ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని aడీఈవో సూపరింటెండెంట్ కు అందించారు. కార్యక్రమంలో సావిత్రి, లక్ష్మి, శంకరమ్మ , స్వరూప, చంద్రమ్మ, సాయమ్మ ఉన్నారు.
Also Read : కోహెడతలో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలె : వొడితెల సతీశ్కుమార్