
అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి సరైన రీతిలో సరైన పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలి. మెరుగైన ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఇటీవలి కాలంలో చాలా మందిని వేధిస్తోన్న సమస్య హైబీపీ. హై బ్లడ్ ప్రెషర్ అనేది ధమనుల గోడల రక్తం కలిగించే అధిక పీడనం వల్ల కలిగే స్థితి. ప్రపంచవ్యాప్తంగా 1.1మిలియన్లకు పైగా ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రక్తపోటును నియంత్రించేందుకు ఇంట్లో ఉండే కొన్ని ఆహర పదార్థాలు, వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మందార టీ:
మందార టీ ఆంథోసైనిన్, ఇతర యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. రక్తనాళాలు సన్నబడటాన్ని నివారించానికి ఈ రెండూ కలిసి పనిచేస్తాయి.
2. ఆకుపచ్చ కూరగాయలు:
ఆకు కూరలలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది టమోటాలు, బంగాళదుంపలు, బీట్‌రూట్, చిలగడదుంపలు, పుట్టగొడుగులు, వెల్లుల్లి వంటి కూరగాయలు కూడా రక్తపోటును తగ్గిస్తాయి.
3. ధాన్యాలు, పప్పులు:
బీన్స్, పప్పులు, ధాన్యాల్లో ప్రోటీన్, ఫైబర్ లాంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తనాళాల పనితీరును ప్రోత్సహించడం, వాపులను తగ్గించడంతో పాటు, రక్తపోటును తగ్గించడంలోనూ సహాయపడతాయి.
4. గింజలు:
బాదం, పిస్తా , వాల్‌నట్ వంటి నట్స్‌లో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
5. తృణధాన్యాలు:
తృణధాన్యాలు ముఖ్యంగా బీటా-గ్లూకాన్ అని పిలువబడే ఒక రకమైన ఫైబర్ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. సమతుల్య ఆరోగ్యకరమైన ఆహారంలో ఈ ఆహారాలను చేర్చడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
6. సెలెరీ జ్యూస్:
సెలెరీ జ్యూస్‌లో 3-n బ్యూటైల్ఫ్తలైడ్ ఉంటుంది. ఇది రక్త నాళాల కండరాల గోడలను సడలిస్తుంది. రక్త నాళాలు విస్తరించడం, రక్తం సులభంగా ప్రవహించేలా చేసి రక్తపోటును తగ్గిస్తుంది.
7. అవిసె గింజలు:
మీరు అధిక రక్తపోటు కోసం మందులు ఎక్కువగా తీసుకున్నప్పటికీ, అవిసె గింజలను తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ గింజల్లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, లిగ్నాన్స్, పెప్టైడ్స్, ఫైబర్ ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.