కిడ్నీలు.. మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి మలినాలను బయటికి పంపడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. అంతే కాకుండా రక్తంలో ఉండాల్సిన వివిధ పదార్థాలను కంట్రోల్ చేస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే శరీరం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. మన శరీరంలో గుండె తర్వాత అంత కీలకమైన అవయవం కిడ్నీలే. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా నీళ్లు తాగటం ఎంత ముఖ్యమో కొన్ని ఫుడ్స్ కి దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు తినకూడని ఫుడ్స్:
అవకాడో:
అవకాడోలో గుండెకి మేలు చేసే హార్ట్ హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఉన్నప్పటికీ వీటిలో అధిక శాతం పొటాషియం ఉంటుంది కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని అస్సలు తినకుండా ఉండటం మంచిది.
డైరీ ప్రొడక్ట్స్:
ఫ్యాట్ అధికంగా ఉండే చీజ్, బట్టర్, క్రీంలు కిడ్నీలను ఇబ్బందికి గురి చేస్తాయి. అంతే కాకుండా వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయి కార్డియోవస్కులర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని అస్సలు తీసుకోకుండా ఉండటం మంచిది.
ప్రొసెస్డ్ మీట్:
ప్రొసెస్డ్ మీట్ లో సోడియం, ఫాస్ఫర్స్, అన్ హెల్తి ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి.. వీటిని తిన్నప్పుడు బ్లడ్ ప్రెజర్ పెరిగి కిడ్నీల పనితీరుపై పడుతుంది. అంతే కాకుండా కార్డియో వస్క్యూలర్ సమస్యలు, కిడ్నీ వ్యాధులకు దారి తీస్తుంది. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం మంచిది.
టమోటాలు:
టమోటాల్లో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు టమోటాలు తినకపోవడం మంచిది.
నారింజ:
నారింజలో విటమిన్ సి తో పాటు పొటాషియం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు నారింజ అస్సలు తినకపోవడం మంచిది.
రెడ్ మీట్:
రెడ్ మీట్ లో ప్రోటీన్స్, పసఫోరస్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని అస్సలు తినకపోవడం మంచిది.
నిల్వ ఉంచిన ఆహారం:
నిల్వ ఉంచిన కూరగాయలు, బీన్స్ లో అధికంగా సోడియం ఉంటుంది. బ్లడ్ ప్రెజర్ ని పెంచి ఫ్లూయిడ్ రిటెన్షన్ కి దారి తీస్తుంది. దీంతో కిడ్నీలపై అధిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని అస్సలు తినకుండా ఉండటం మంచిది.
రిఫైన్డ్ సుగర్స్:
రిఫైన్డ్ సుగర్స్ అధికంగా ఉండే సోడా, స్వీట్స్, బరువును పెంచుతాయి, బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. ఇది కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూవుతుంది కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం మంచిది.
ఆల్కహాల్:
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది.. బాడీ డిహైడ్రేట్ అవుతుంది. ఇది కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిది.