వర్షాకాలంలో పాదాలు ఎక్కువగా నీటిలో నానుతూ ఉంటాయి. ఈ సీజన్‌లో రోడ్లపైకి బురద వచ్చి చేరుతుంది, కాళ్లకు బురద అంటుకోవడంతో పాటు.. ప్రమాదకరమైన క్రిములు సైతం మన పాదాల మీదకు చేరుకుంటాయి. ఈ కాలంలో పాదాలను రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి.అయితే ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కేవలం ఇంట్లోని వస్తువులను ఉపయోగించి కాళ్లను శుభ్రంగా తయారుచేసుకోవచ్చు. అయితే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలం మొదలైందంటే చాలా రకాల ఇన్ఫెక్షన్లు మొదలవుతుంటాయి. వర్షం నీటిలో తడవడం వల్ల చర్మం వివిధ రకాలుగా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా కాళ్లు అయితే విపరీతంగా పాడవుతాయి. బయటకు వెళ్లిన క్రమంలో వర్షం నీటిలో తడిచి కాళ్లలో ఇన్ఫెక్షన్లు, మురికి వంటి సమస్యలు ఏర్పడతాయి. బురద నీటిలో తిరిగితే పాదాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అందువల్ల వర్షాకాలంలో పాదాలను తరచూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్ల బారిన పడి కాళ్ల పగుళ్లు, మంటలు, దురద వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గోళ్లలో మురికి పేరుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.
ALSO READ | Good Health: వర్షాకాలం.. బత్తాయితో బోలెడు లాభాలు..
గోళ్లలో మట్టి చేరడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. అందుకే గోళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. తరచూ పాదాలను నీటిగా శుభ్రం చేసుకోవాలి. ఈ క్రమంలో కాలి గోళ్లను కూడా పరిశుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు తరచూ బయటకు వెళ్లి వచ్చిన అనంతరం కాళ్లను సబ్బుతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను నివారించవచ్చు. పాదాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ఇంట్లోని చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి.
బేకింగ్ సోడా: బేకింగ్ సోడా పాదాలను శుభ్రం చేసేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. వంటింట్లో ఉండే బేకింగ్ సోడాను గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలి. అనంతరం కాళ్లను ఆ నీటిలో పాదాలను 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత పాదాలను బాగా రుద్ది శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మురికి తొలగిపోయి శుభ్రంగా మారుతుంది.
హిమాలయన్ పింక్ సాల్ట్: పింక్ సాల్ట్ మురికిని తొలగించేందుకు సహాయపడుతుంది. పింక్ సాల్ట్ లో కొబ్బరి నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు బాగా రాసి స్ర్కబ్ చేసుకోవాలి. అనంతరం నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి.
వెనిగర్: ఒక బకెట్ తీసుకుని అందులో సగం నీరులో వెనిగర్ కలుపుకోవాలి. అనంతరం బకెట్లోని నీటిలో 15 నిమిషాల పాటు పాదాలను ఉంచాలి. అనంతరం పాదాలను టవల్ తో తుడుచుకుని ఫుట్ క్రీమ్ రాసుకోవాలి. ఇలా వారినికి 3 సార్లు చేస్తే పాదాలు శుభ్రంగా మారుతాయి.
చెప్పులు ఇలా..వర్షకాలంలో వేసుకొనే చెప్పుల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ సీజన్లో షూస్ వేసుకోకపోవడమే మంచిది. లేదా రోడ్డుపై నడుస్తున్నప్పుడు వీటిలోకి నీరు చేరే అవకాశం ఉంది. ఈ నీటిలో పాదాలు ఎక్కువ సమయం ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. వాటికి బదులు పాదాలకు గాలి తగిలేలా ఉండే ఫుట్‌వేర్ ఎంచుకోవడం మంచిది.
క్లీన్‌గా ఉంచుకోండి..పాదాలను శుభ్రంగా ఉంచుకోకపోతే.. ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది. వర్షకాలం బయట నుంచి రాగానే.. పాదాలను లిక్విడ్ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. లేకపోతే.. నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పాదాలను బాగా పొడిగా తుడుచుకొని వేళ్ల మధ్యలో యాంటీ ఫంగల్ పౌడర్ చల్లుకోవాలి. అలాగే కాలిగోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. లేదంటే వాటిలో మురికి చేరి దురదలు, ఇతర చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
స్క్రబ్ కచ్చితంగా..వర్షాకాలంలో పాదాలను రోజూ స్క్రబ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా షాంపూ వేసుకుని, దీనిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత ఫుట్ స్క్రబ్‌తో శుభ్రం చేసుకోవాలి. అలాగే రోజూ ప్యుమిస్ స్టోన్‌ని ఉపయోగించి పాదాలను క్లీన్ చేసుకోండి.
మాయిశ్చరైజర్ రాసుకోవాలి: వర్షాకాలంలో ప్రతి రోజు పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఆల్మండ్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేసుకోవడం చాలా ఉత్తమం.ఈ కాలంలో పాదాలకు పగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి మృతచర్మం తొలగిపోయేలా స్క్రబ్బర్‌తో రుద్దాలి. డెడ్ స్కిన్‌ను తొలగిస్తే పాదాల పగుళ్లు తగ్గుతాయి.
వేపాకులను పేస్ట్‌లా..వేపాకులను పేస్ట్‌లా చేసి ఇక స్పూన్ పసుపు కలిపి పాదాలకు ప్యాక్ వేయాలి. ఆరిన తర్వాత షాంపూతో రుద్ది కడిగితే పగుళ్ల సమస్య తగ్గిపోతుంది. వర్షాకాలంలో తరచూ షూస్ వేసుకోకూడదు. ఎందుకంటే వర్షంలో తడిసినపుడు షూస్‌లో ఉన్న తేమ పాదాలకు ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. రోజ్ వాటర్, గ్లిజరిన్ ఈక్వల్‌గా తీసుకొని రాత్రివేళ పాదాలకు మర్దన చేసి మార్నింగ్ గోరువెచ్చటినీళ్లలో షాంపూ కలిపి పాదాలను కడిగితే, మురికి సులువుగా తొలగిపోతుంది
యాంటీ ఫంగల్ పౌడర్: ఈ సీజన్‌లో పాదాలకు క్రీమ్ రాసుకోవడం వల్ల తేమను పెంచుతుంది. ఆపై ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. మీరు బయటకు వెళ్లే ముందు, మీ మడమల చుట్టూ, మీ కాలి మధ్య ప్రాంతంలో యాంటీ ఫంగల్ పౌడర్‌ను చల్లండి. ఇది మీ పాదాలను పొడిగా ఉంచి బ్యాక్టీరియా వృద్ధిని నివారిస్తుంది.
కాలి గోళ్లను క్రమం తప్పకుండా కత్తిరించండి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో కాలి గోళ్ల మధ్య ఇసుక, ధూళి పేరుకుపోతాయి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు పాదాలకు ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సోకితే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి.