ఫుట్​పాత్ లు ఎక్కడా సక్కగలేవ్.. సిటీ మొత్తం ఆక్రమణలతో కనుమరుగు

ఫుట్​పాత్ లు ఎక్కడా సక్కగలేవ్.. సిటీ మొత్తం ఆక్రమణలతో కనుమరుగు
  • కంటిన్యూగా కిలోమీటరు నడిచే పరిస్థితి లేదు
  • బాగున్న వాటిని కూల్చి మళ్లీ కడుతున్న బల్దియా
  •  డ్యామేజ్ అయిన వాటిని అసలే పట్టించుకోవట్లే
  •  హైడ్రా పరిధిలోకి రావడంతో పాదచారుల ఆశలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో రోజురోజుకు ఫుట్​పాత్​లు కనుమరుగవుతున్నాయి. యేటా ఫుట్​పాత్​ల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. గ్రేటర్ లో 9,013 కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా 430 కిలోమీటర్ల పరిధిలో ఫుట్ పాత్ లు ఉన్నాయి. అయితే, ఒకటి, రెండు ప్రాంతాల్లో మినహా ఎక్కడా ఫుట్​పాత్​పై కిలోమీటరు మేర నడిచే పరిస్థితి లేదు. ఐటీ కారిడార్ల నుంచి మొదలు పెడితే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లోనూ ఫుట్​పాత్​లు సరిగ్గా లేవు. ఉదాహరణకు బంజారాహిల్స్​రోడ్​నంబర్​10లో చూస్తే రోడ్డుకు రెండు వైపులా కొన్ని కిలోమీటర్ల మేర ఫుట్​పాత్​లు రోడ్డుకు కలిసిపోయి కనిపిస్తున్నాయి.

చాలాచోట్ల ఫుట్​పాత్​మంచిగా ఉన్నప్పటికీ.. ఆక్రమణకు గురికావడంతో పాదచారులు రోడ్లపై నడవాల్సి వస్తున్నది. కమర్షియల్​ఏరియాలైన సికింద్రాబాద్, అబిడ్స్, కోఠి, దిల్​సుఖ్ నగర్, లంగర్ హౌస్, నానల్ నగర్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఉప్పల్ తదితర ప్రాంతాల్లోనూ ఫుట్​పాత్​లు సక్రమంగా లేవు. కోఠి లాంటి ప్రాంతాల్లో ఫుట్ పాత్ లను వ్యాపారులు ఆక్రమించేశారు. ఇటువంటి ప్రాంతాల్లో మంచిగా ఉన్న ఫుట్​పాత్​లను బల్దియా తొలగించి, మళ్లీ అక్కడే కొత్తగా నిర్మించింది. ఫుట్​పాత్​లు లేని ఏరియాల్లో కొత్తగా కడతామని చెబుతున్నా చేసిందేమీ లేదు. హైకోర్టు పలుమార్లు సీరియస్​అయినా లైట్​తీసుకుంది. తాజాగా ఫుట్​పాత్​ల  నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం హైడ్రాకు అప్పగించడంతో మార్పు వస్తుందని సిటీ ప్రజలు ఆశిస్తున్నారు.

మృతుల్లో 15 శాతం పాదచారులే..

యేటా సిటీ రోడ్లపై జరుగుతున్న ప్రమాదాల్లోని మృతుల్లో 15 శాతం వరకు పాదచారులే ఉంటున్నారని నివేదికలు చెప్తున్నాయి. గతేడాది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్​కమిషనరేట్ల పరిధిలో జరిగిన యాక్సిడెంట్లలో 120 మంది పాదచారులు చనిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.  మరోవైపు టాయిలెట్లు, అన్నపూర్ణ క్యాంటీన్లతోపాటు బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్వహణను బల్దియా చూస్తోంది. వీటన్నింటినీ రూల్స్​కు విరుద్ధంగా ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపైనే ఏర్పాటు చేస్తోంది.

ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఆక్రమణలను తొలగించాల్సిన జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీనే ఈ విధంగా పాదచారులను ఇబ్బందులకు గురిచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హరితహారలో భాగంగా చాలాచోట్ల ఫుట్ పాత్ లపైనే మొక్కలు పెట్టారు. అవి ఏపుగా పెరగడంతో పాదచారులకు అడ్డంకిగా మారాయి. వీటితో పాటు కరెంట్, ఇంటర్నెట్​కేబుల్​స్తంభాలు, డ్రైనేజీల కోసం వేసిన పైపులను కూడా ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై నుంచే వేస్తున్నారు. 

ఏజెన్సీలు పట్టించుకోవట్లే..

కాంప్రెన్సివ్ రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్ (సీఆర్ఎంపీ)  కింద నగరంలోని మెయిన్​రోడ్ల  నిర్వహణ బాధ్యతలను జీహెచ్ఎంసీ ఏజెన్సీలకు అప్పగించింది. బల్దియా పర్యవేక్షణలో జరిగే ఈ పనులను ఏడు ప్యాకేజీలుగా విభజించి రూ.1,839 కోట్ల వ్యయంతో 812 కిలోమీటర్ల రోడ్లను ఐదేండ్ల పాటు నిర్వహించేందుకు  అప్పగించింది. ఈ రోడ్లపై రీకార్పెటింగ్, ఫుట్ పాత్ ల నిర్వహణ, లేన్ మార్కింగ్, స్వీపింగ్, గ్రీనరీ నిర్వహణ తదితర పనులను ఏజెన్సీలు నిర్వహించాలి.

కానీ ఫుట్​పాత్​ల నిర్వహణను ఏజేన్సీలు పట్టించుకోవడంలేదు. ఈ ఏజెన్సీల పరిధిలోకి వచ్చే కొన్ని ప్రాంతాల్లో కనీసం ఫుట్​పాత్​అన్నదే కనిపించడంలేదు. మరో ఆరునెలల్లో ఈ ఏజెన్సీల గడువు ముగియనుండడంతో పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి.