రెచ్చిపోతున్న ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌ మాఫియా

రెచ్చిపోతున్న ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌ మాఫియా
  • ఆక్రమించి షాపులకు అద్దెకు ఇస్తున్నట్లు గుర్తింపు 
  • తొలగింపును షురూ చేసిన హైదరాబాద్ ​పోలీసులు
  • టోలిచౌకి, షేక్ పేట, ఫిలింనగర్​ప్రాంతాల్లో కొనసాగిన స్పెషల్​ డ్రైవ్​
  • దగ్గరుండి ఆక్రమణలను తొలగించిన సిటీ సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌
  • అధికారులకు పొలిటికల్​ లీడర్లు సహకరించాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: సిటీలో ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌ మాఫియా పెరిగిపోతోందని, ఆక్రమించి పేదలకు రెంట్‌‌‌‌‌‌‌‌కు ఇస్తున్నారని హైదరాబాద్​పోలీస్​కమిషనర్​సీవీ ఆనంద్ తెలిపారు. మరికొందరు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వెహికల్స్​పార్క్​చేసి ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలను రోప్(రిమూవబుల్‌‌‌‌‌‌‌‌ అబస్ట్రాక్టివ్‌‌‌‌‌‌‌‌ పార్కింగ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌క్రోచ్‌‌‌‌‌‌‌‌మెంట్స్) ఆపరేషన్​ద్వారా పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. మంగళవారం టోలిచౌకి, షేక్‌‌‌‌‌‌‌‌పేట, ఫిలింనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిసర ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అడిషనల్ సీపీ(ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌) విశ్వప్రసాద్‌‌‌‌‌‌‌‌, ట్రాఫిక్ పోలీసులతో కలిసి తనిఖీలు చేశారు. 

ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్​లను ఆక్రమించి ఏర్పాటు చేసిన షాపులను తొలగించారు. అనంతరం గత నెల రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో సీజ్​చేసిన1,015 సైరన్లు, 525 మల్టీ-టోన్ హారన్లను జేసీబీలు, రోడ్​ రోలర్లతో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద్​మాట్లాడుతూ.. ‘‘ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్ ఆక్రమణలను తొలగిస్తున్నప్పుడు కొంతమంది పేదవాళ్లమని చెప్పుకుంటున్నారు. అయితే వారిలో చాలామంది అద్దెకు తీసుకుని షాపులు ఏర్పాటు చేసుకున్నవారే ఉంటున్నారు. సిటీలోని ఫుట్​పాత్​ మాఫియాపై సోషల్ మీడియా ద్వారా మాకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. తొలగింపు చేపట్టిన ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డుపడి ఆపుతున్నారు. అధికారులకు, ఆక్రమణల తొలగింపునకు పొలిటికల్​లీడర్లు సహకరించాలి. ఫుట్​పాత్​మాఫియాకు కొందరు రాజకీయ నాయకులు సహకరిస్తున్నారు. 

మళ్లీ వారే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదని విమర్శిస్తుంటారు. పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య కారణంగా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి కూడా గ్రీన్‌‌‌‌‌‌‌‌ చానల్‌‌‌‌‌‌‌‌ అవసరం లేదని చెప్పారు. కానీ చాలామంది పొలిటికల్​లీడర్లు అనధికారికంగా సైరన్, రెడ్‌‌‌‌‌‌‌‌, బ్లూ లైట్లు, వీఐపీ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. ఇలాంటి వారిపై నిఘా పెట్టాం. ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ అడిషనల్ సీపీగా మూడేండ్లు పనిచేసిన అనుభవం నాకు ఉంది. ట్రాఫిక్ పోలీసులు సరిగ్గా పనిచేస్తే ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయి. గ్రేటర్ పరిధిలో ప్రతిరోజు 1,500 వాహనాల రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. 88 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్లు పెరగడం లేదు. దీంతోనే ట్రాఫిక్ జామ్‌‌‌‌‌‌‌‌ అవుతున్నది” సీపీ చెప్పారు.