50 మొక్కలు నాటాల్సిందే: కోర్టు ధిక్కారణకు పాల్పడిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు శిక్ష

జబల్​పూర్: క్రిమినల్ కేసులో కోర్టు ధిక్కారణకు పాల్పడటంతో 50 మొక్కలు నాటాలని రాహుల్ సాహు అనే వ్యక్తిని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. తన భార్య దాఖలు చేసిన కేసు విచారణలో ఉన్నప్పుడు కోర్టు ప్రొసిడీంగ్స్‎కు సంబంధించిన ఫొటోను సాహు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సంబాల్ గఢ్​లోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్(జేఎంఎఫ్​సీ) ఈ పోస్ట్​ను గుర్తించింది. సాహుకు నోటీసులు అందించింది.

 అతడు స్పందించకపోవడంతో హైకోర్టుకు నివేదించింది. నోటీసులకు స్పందించకపోవడంతో హైకోర్టు సుమోటో యాక్షన్ తీసుకుంది. ఈ క్రమంలో సాహు అఫిడవిట్ ఫైల్ చేశారు. తాను10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని, లీగల్ ప్రొసీడింగ్స్‎పై అవగాహన లేదన్నారు. బేషరతు క్షమాపణ చెప్పారు. దీనిని అంగీకరించిన కోర్టు 50 మొక్కలు నాటాలని ఆదేశించింది.