సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ.. 10వ, 12వ తరగతి పరీక్షా ఫలితాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని సీనియర్ బోర్డు అధికారి ఓ ముఖ్య ప్రకట ద్వారా వెల్లడించారు. పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ చివరి దశలోకి చేరుకుందని, ఫలితాలు త్వరలోనే తెలిపారు. కాగా ఈ ఫలితాలు నేరుగా results.cbse.nic.in, cbse.gov.in వెబ్‌సైట్‌లో విడుదల కానున్నాయి.
సీబీఎస్ఈ(CBSE) 10, 12వ తరగతి సంబంధించిన ఫలితాల నోటిఫికేషన్ కు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని విద్యా శాఖ విడుదల చేయలేదని తెలిపారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న నోటిఫికేషన్ నకిలీదని అధికారు తేల్చి చెప్పారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఇలాంటి ఫేక్ వెబ్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఫలితాలు వచ్చిన వెంటనే results.cbse.nic.in వెబ్ పోర్టల్‌లో స్కోర్‌కార్డ్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి తప్పకుండా కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది.
స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ తెలుసుకోవడానికి అధికారిక పోర్టల్- cbse.nic.in, cbseresults.nic.in, results.nic.in ను సందర్శించాలి. అందుకోసం ముందుగా విద్యార్థులు సైట్ లో లాగ్-ఇన్ అవ్వాల్సి ఉంటుంది. దీని కోసం రోల్ నంబర్‌తో పాటు హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు సైట్‌లో ఫిల్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేస్తే స్క్రీన్‌పై స్కోర్‌కార్డ్ కనిపిస్తుంది. అలా స్కోర్ కార్డును సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ నొక్కాల్సి ఉంటుంది.
డిజిలాకర్ ద్వారా..
డిజిలాకర్ యాప్ ద్వారా ఫలితాలను పొందడానికి ముందుగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం digitallocker.gov.in సందర్శించాలి. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రార్ అవ్వాలి. కావాలనుకుంటే దీనికి సెక్యూరిటీ పిన్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత నేరుగా మీ మొబైల్‌కే స్కోర్‌కార్డ్ డెలివరీ అవుతుంది.