
జయశంకర్ భూపాలపల్లి : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రేగొండ రెవెన్యూ కార్యాలయ ఏఎస్వో చిక్కాడు. అదే గ్రామానికి చెందిన వడ్ల మల్లికార్జున్ నుంచి అతడి అత్త డెత్ సర్టిఫికెట్ కోసం ఏఎస్వో రూ. 2వేల లంచం డిమాండ్ చేశాడు. భూపాలపల్లి మంజూరునగర్ లోని కలెక్టర్ ఆఫీస్ మెయిన్ గేట్ వద్ద ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఏఎస్వో మొగుల్ల రఘుపతికి నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం భూపాలపల్లి ఆర్డీవో ఆఫీస్‌లో ఏఎస్వోను అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.