రూ.26 కోట్లతో విలీన గ్రామాల అభివృద్ధి

నిజామాబాద్ రూరల్​, వెలుగు: నిజామాబాద్​ కార్పొరేషన్​లో విలీనమైన గ్రామాల అభివృద్ధికి స్పెషల్​గా రూ.26 కోట్లను ప్రభుత్వం శాంక్షన్​చేసిందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ అన్నారు. ఆదివారం నగర శివారులోని విలీన గ్రామాలైన బోర్గాం(పి), మాధవనగర్​, బ్యాంకు కాలనీ, గూపన్​పల్లి, ఖానాపూర్​, కాలూర్​, సారంగాపూర్​ గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠ ధామాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ శివారు గ్రామాలను  కార్పొరేషన్​లో విలీనం చేసిన టైంలో అనేక మంది విమర్శించారని,  గ్రామాలు  అభివృద్ధికి నోచుకోవని  ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. కానీ సీఎం కేసీఆర్ కు విలీన గ్రామాల సమస్యలను వివరించి స్పెషల్​ఫండ్స్​తీసుకొచ్చానని ఈ సందర్భంగా బాజిరెడ్డి తెలిపారు. ఐడీసీఎంఎస్​ చైర్మన్​ మోహన్, కార్పొరేటర్లు సౌజన్య, లలిత,  శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు.