తాగునీటి కోసం సాగర్ కుడి కాల్వకు నీటి విడుదల

హాలియా, వెలుగు : తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడికాలువ ద్వారా గురువారం నీటి విడుదల చేశారు. ఆంధ్రా ప్రాంతంలో ప్రస్తుతం తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రిజర్వాయర్ కుడి కాల్వకు   మొదటగా 1000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్ట్​ గేట్స్ సబ్ డివిజన్ ఇంజనీర్ కృష్ణయ్య తెలిపారు.

తర్వాత క్రమంగా రాత్రి పది గంటల వరకు 5000 క్యూసెక్కుల వరకు చేరుకుంటుందని చెప్పారు.